హైకోర్టులో ప్రణీత్ రావుకు చుక్కెదురు..పిటిషన్ కొట్టివేత
X
ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుకు తెలంగాణ హైకోర్టులో నిరాశే ఎదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు తనను పోలీసు కస్టడీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. ప్రణీత్ రావు కస్టడీ కరెక్టే అని కింద కోర్టు ఇచ్చిన తీర్పుతో తాము ఏకీభవిస్తున్నామని తెలిపింది. పోలీస్ స్టేషన్ లో పడుకోవడానికి సరైన సౌకర్యం లేదని, కస్టడీకి ఇచ్చేముందు నిర్దిష్ట షరతులను విధించలేదని పిటిషన్ లో ప్రణీత్ రావు చెప్పారు. దర్యాప్తులోని అంశాలను కూడా మీడియాకు లీక్ చేస్తున్నారని ఆరోపించారు. రహస్య విచారణ పేరుతో బంజారాహిల్స్ పీఎస్ లో విచారిస్తున్నారన్నారు. విచారణ ముగిసన తర్వాత తన బంధువులు, లాయర్ ను కూడా అనుమతించడం లేదని ప్రణీత్ ఆవేదన వ్యక్తం చేశారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.