KA Paul : అసెంబ్లీ ఆవరణలో కేఏ పాల్ హల్చల్
X
(KA Paul) అసెంబ్లీ ఆవరణలో ప్రశాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సందడి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు అసెంబ్లికి వచ్చినట్లు తెలిపారు. అక్టోబర్ 2న హైదరాబాద్ లో సమ్మిట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకే ఈ సమ్మిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డి, తాను విదేశీ టూర్ లకు వెళ్ళాలి అనుకుంటున్నట్లు చెప్పారు.
మన తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలను ఆహ్వానించడానికి వెళ్తామని తెలిపారు. అదానీ, అంబానీకీ 25లక్షల కోట్లు రూపాయిలు మాఫీ చేశారని చెప్పారు. గత పదేండ్లలో 12 లక్షల కోట్ల రూపాయలతో కేసీఆర్ తెలంగాణను అప్పులపాలు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ లీడర్ అని.. వారి ఆధ్వర్యంలో ఆర్ధిక బడ్జెట్ ను చక్కదిద్దుతారన్న నమ్మకం ఉందని కొనియాడారు. తమ్ముడు రేవంత్ రెడ్డి పాలన బావుందని చెప్పుకొచ్చారు. ఈ సారీ వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు.