Pravallika Brother : మా అక్క ఆత్మహత్యకు కారణం శివరామే: ప్రవళ్లిక తమ్ముడు
X
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిరుద్యోగి ప్రవళ్లిక ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. గ్రూప్ 2 వాయిదా కారణంగానే ఆమె చనిపోయిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ప్రవళ్లిక తమ్ముడు కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనంగా మారింది. ప్రవళ్లిక ఆత్మహత్యకు కారణం శివరామే అని స్పష్టం చేశాడు. తమకు న్యాయం జరగాలంటే అతన్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశాడు. ఈ విషయంలో ఏ పార్టీలు కూడా తమ ఇంటికి రావొద్దని, కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని కుమార్ విజ్ఞప్తి చేశాడు.
‘అక్క హాస్టల్ కు నేను కొంచెం దూరంలోనే ఉంటా. ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకోవచ్చు. వారానికి మూడుసార్లు కలిసి మాట్లాడుకుంటాం. మా అక్క చనిపోవడానికి కారణం శివరామే. అతను వేరే అమ్మాయిల వల్ల ప్రవళ్లికకు పరిచయం అయ్యాడు. అక్కకు ఇష్టం లేకపోయినా తనతో మాట్లాడటం, కాల్స్, మెసేజ్లు చేయడం చేసేవాడు. హాస్టల్ కు వచ్చి ఇబ్బంది పెట్టేవాడు. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా డిప్రెషన్ లోకి వెళ్లింది. సూసైడ్ చేసుకుంది. అక్క చావుకు న్యాయం జరగాలంటే.. శివరాం ఎక్కడున్నా అతన్ని పట్టుకుని శిక్షించాలి. తను చనిపోయినట్లు ఉరిగానీ, ఎన్ కౌంటర్ గానీ చేసి ప్రభుత్వం న్యాయం చేయాల’ని కుమార్ డిమాండ్ చేశాడు.
Attention ! Now Pravalika's Mother Comes Up With The Actual Reason Behind Her Daughter Pravalika's Suicide And Requests Not To Drag This as Political Issue
— Hari Krishna S (@Hari_krishna8) October 17, 2023
Her Brother Also Spoke Truth Behind The Suicide Case And Requests For justice
This Videos Will Shut The Mouth of BJP And… pic.twitter.com/MvUlpmnge9