నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
X
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకొని, రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు (జూన్17న) ఉదయం దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రీవ్యూయింగ్ ఆఫీసర్‌గా హాజరవుతారు. అకాడమీలో జరగనున్న పరేడ్ కార్యక్రమంలో ప్రతిభ చూపిన క్యాండెట్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ర్యాంకులు, అవార్డులు అందజేయనున్నారు. ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్‌గార్డు, వైమానిక దళ క్యాడెట్లు, మన దేశంతో స్నేహపూర్వకంగా ఉండే సరిహద్దు దేశాలకు చెందిన క్యాడెట్లకు ‘వింగ్స్’, ‘బ్రెవెట్స్’ను రాష్ట్రపతి ప్రధానం చేయనున్నారు. పరేడ్ అనంతరం రాష్ట్రపతి ముర్ము ఉదయం 11.35 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరి వెళతారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి నేతృత్వంలో.. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి హాజరుకాబోయే కార్యక్రమానికి, దుండిగల్ ప్రాంతమంతా గట్టి బందోబస్తును నియమించారు. కాగా శీతాకాల విడిదికి వచ్చినపుడు రాష్ట్రపతి తెలంగాణలోని రామప్ప ఆలయం, భద్రాచలం ఆలయాన్ని ఆమె సందర్శించారు. ఈసారి మాత్రం.. దుండిగల్ పరేడ్ కార్యక్రమం అనంతరం .. తిరిగి ఢిల్లీకి పయనమవనున్నారు.