Home > తెలంగాణ > హామీ ఇస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తా.. నరేంద్ర మోదీ

హామీ ఇస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తా.. నరేంద్ర మోదీ

హామీ ఇస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తా.. నరేంద్ర మోదీ
X

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి కి ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి తాము సహకరిస్తామని వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సాధ్యమైనంత మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘‘ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి అభినందనలు. రాష్ట్రాభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హమీ ఇస్తున్నా’’ అని ప్రధాని తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ప్రధాని మోదీతో సహ పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు, టీడీపీ నేత నారా లోకేశ్‌, మెగాస్టార్ చిరంజీవి ఇంకా కొంతమంది రేవంత్ నాయకత్వానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇదిలా ఉండగా ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పనున్నారు. అదే సమయంలో మిగిలిన మంత్రి పదవుల ఖరారు పైన చర్చించనున్నారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారంటీ పథకాలకు చట్ట బద్దత కల్పించనున్నారు. ఆ తరువాత పథకాల అమలుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదా లో ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న రేవంత్ రెడ్డి ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరుతున్నట్లు సమాచారం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర అంశాల పైన ప్రధాని మోదీతో చర్చించనున్నారు. వచ్చే వారం రేవంత్ ఢిల్లీలో ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది.


Updated : 7 Dec 2023 10:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top