మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ.. ఈ నెల 11న..
X
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ నెల 11న ఆయన హైదరాబాద్కు వస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే మాదిగల విశ్వరూప బహిరంగ సభలో పాల్గొంటారు. 11న సాయంత్రం 4.45కు మోదీ బేగంపేట విమానాశ్రయం చేరకుంటారు. సాయత్రం 5గంటలకు పరేడ్ గ్రౌండ్స్కు చేరుకుని 5.45 వరకు అక్కడే ఉంటారు. 5.55కు తిరిగి బేగంపేటకు చేరుకుని ఢిల్లీ పయనమవుతారు.
ఈ సభలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మోదీ కీలక ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. రిజర్వేషన్ల కోసం మాదిగలు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఒకవేళ మోదీ దీనిపై ఏదైన ప్రకటన చేస్తే.. తెలంగాణ ఎన్నికల వేళ ఇది కీలకంగా మారే అవకాశం ఉంది. మంగళవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ పాల్గొన్నారు. బీసీలకు అన్ని పార్టీలు అన్యాయం చేశాయని.. బీజేపీ మాత్రమే వారికి అండగ నిలిచిందన్నారు. బీజేపీ గెలిస్తే బీసీని సీఎం చేస్తామని స్పష్టం చేశారు.