రేపు రాష్ట్రానికి ప్రియాంక గాంధీ.. రెండ్రోజుల పాటు ప్రచారం..
X
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో 5 రోజుల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలన్నీ జోరు పెంచాయి. వరుస సభలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు క్యూకడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు.
శుక్ర, శనివారాల్లో ప్రియాంక గాంధీ సుడిగాలి పర్యటనలతో ప్రచారం నిర్వహించనున్నారు. నవంబర్ 24న పాలకుర్తి, హుస్నాబాద్ లో నిర్వహించే సభల్లో ఆమె పాల్గొంటారు. అనంతరం కొత్తగూడెం వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రియాంక ప్రసగించనున్నారు. రాత్రికి ఖమ్మంలో బస చేయనున్నారు.
శనివారం సైతం మూడు వరుస సభల్లో ప్రియాంక పాల్గొంటారు. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.