Home > తెలంగాణ > గాంధీభవన్‌లో ఇబ్రహీంపట్నం కార్యకర్తల హంగామా..

గాంధీభవన్‌లో ఇబ్రహీంపట్నం కార్యకర్తల హంగామా..

గాంధీభవన్‌లో ఇబ్రహీంపట్నం కార్యకర్తల హంగామా..
X

హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ నాయకుడికి టిక్కెట్ దక్కలేదని ఇబ్రహీం పట్నం కార్యకర్తలు గాంధీభవన్ వద్ద హంగామా చేశారు. ఇబ్రహీం పట్నంకి చెందిన దండెం రామిరెడ్డి వర్గీయులు గాంధీ భవన్ వద్ద రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో రామిరెడ్డితో పాటు సుమారు 100 మంది ఆయన అనుచరులు ఉన్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే రెబల్ గా పోటీచేస్తానని రాంరెడ్డి తెలిపారు. రేవంత్ ఫ్లెక్సీలను కార్యకర్తలు తగలబెట్టారు. ఈ ఉద్రిక్తతల మధ్య గాంధీభవన్‌కు సెక్యూరిటీ సిబ్బంది తాళం వేశారు.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధిష్టానం రెండో జాబితాలో దండెం రాంరెడ్డి పేరును ప్రకటిస్తారని జోరుగా ప్రచారం సాగింది. అయితే పార్టీ అధిష్టానం మాత్రం .. మల్‌రెడ్డి రంగారెడి కి టికెట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఇబ్రహీంపట్నం టిక్కెట్ కై పలువురు పోటీపడినప్పటికీ.. అంతా కలిసి పని చేసి స్థానాన్ని నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు. కానీ మర్రి నరింజన్‌రెడ్డి, దండెం రాంరెడ్డి మాత్రం పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మర్రి నిరంజన్ రెడ్డి.. రెబల్ గా పోటీ చేస్తానని ప్రకటించగా.. ఈ రోజు దండెం రామిరెడ్డి మాత్రం తన అనుచరులతో కలసి ఆందోళన చేపట్టారు.




Updated : 2 Nov 2023 2:11 PM IST
Tags:    
Next Story
Share it
Top