Home > తెలంగాణ > Pulse Polio : తెలంగాణ వ్యాప్తంగా మార్చి 3న పల్స్ పోలియో

Pulse Polio : తెలంగాణ వ్యాప్తంగా మార్చి 3న పల్స్ పోలియో

Pulse Polio : తెలంగాణ వ్యాప్తంగా మార్చి 3న పల్స్ పోలియో
X

నిండు జీవితానికి రెండు చుక్కలు.. పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ఏటా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతోంది.. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు అందించనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు.వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మార్చి 3న పల్స్ పోలియో నిర్వహించేందుకు వైద్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు.

పిల్లల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మార్చి 3వ తేదీ నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పల్స్‌ పోలియో నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో పరిపూర్ణాచారి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎస్‌ఎంవో కన్సల్టెన్ట్‌ డాక్టర్‌ మురారి ఆధ్వర్యంలో పల్స్‌పోలియోపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో జిల్లాలోని ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. మొదటిరోజునే 90శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, మిగతా పిల్లలను గుర్తించి తదుపరి రెండు రోజుల్లో పోలియో చుక్కలు వేయాలన్నారు. పోలియో కేంద్రాలతోపాటు రైల్వేస్టేషన్‌, బస్టాండ్లలో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్‌ శిల్పిని, డాక్టర్‌ యశోద, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ వంశీ కృష్ణ, వైద్యులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated : 23 Feb 2024 7:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top