Home > తెలంగాణ > Ragging :పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

Ragging :పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

Ragging :పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
X

పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది.కాలేజీలో కొందరు సీనియర్ విద్యార్థులు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న జూనియర్ విద్యార్థులకు అమానుషంగా గుండు కొట్టించారు. సోమవారం రాత్రి సీనియర్‌ విద్యార్థులు ఇద్దరు జూనియర్‌ విద్యార్థులను జుట్టు ఎందుకు పెంచుతున్నావంటూ ట్రిమ్మర్‌తో గుండు చేసి, మీసాలు తొలగించారు. హాస్టల్‌లో మూకుమ్మడిగా సీనియర్‌ విద్యార్థులు జూనియర్‌ విద్యా ర్థుల గదుల్లోకి చొరబడి వీరితో పాటు మరో ముగ్గురిని కూడా ర్యాగింగ్‌ చేశారు. అనంతరం బలవంతంగా వారి మీసాలను కూడా ట్రిమ్మర్‌తో షేవ్ చేశారు. ఈ క్రమంలో తమను వదిలేయండన్నా.. అంటూ ప్రాధేయపడినా సీనియర్లు వినలేదని బాధిత విద్యార్థులు వాపోయారు.





ఈ సంఘటనపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ర్యాగింగ్‌తో భయంతో ఇద్దరు విద్యా ర్థులు తమ ఇండ్లకు వెళ్లిపోయారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు గోదావరి ఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థులపై పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఫస్ట్ ఇయర్ విద్యార్థులు వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ఎదట ఆందోళనకు దిగారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లపై పోలీసుల చేత విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





ఇక ర్యాగింగ్‌ ఘటనపై నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై శాసనమండలిలో చర్చించాలని కోరుతూ మండలి చైర్మన్‌కు లేఖ రాశారు. ర్యాగింగ్‌ అనేది అమానవీయమని, మానవ హక్కుల ఉల్లంఘన అని కవిత వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని డిమాండ్‌ తన లేఖలో చేశారు.




Updated : 14 Feb 2024 11:32 AM IST
Tags:    
Next Story
Share it
Top