Home > తెలంగాణ > మరో 2 నెలల్లో అర్హులైన రైతులందరికీ రూ.లక్ష రుణమాఫీ!!

మరో 2 నెలల్లో అర్హులైన రైతులందరికీ రూ.లక్ష రుణమాఫీ!!

మరో 2 నెలల్లో అర్హులైన రైతులందరికీ రూ.లక్ష రుణమాఫీ!!
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో రైతులకు ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ పథకాన్ని అర్హులైన రైతులందరికీ అమలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు. రైతుబంధు నిధులను వారి రుణ ఖాతాల్లో జమ చేయొద్దని ఇప్పటికే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. సచివాలయంలో సోమవారం వ్యవసాయశాఖపై ఆయన సమీక్షించారు. ‘ఇప్పటి వరకు 5,42,635 మంది రైతులకు చెందిన రూ.1,207 కోట్ల రుణాలను మాఫీ చేశాం. మిగిలిన వారి కోసం 2023-24 బడ్జెట్‌లో రూ.6,325 కోట్లు కేటాయించాం. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) ప్రకారమే అన్ని బ్యాంకులు రైతుల ఖాతాలను రెన్యువల్‌ చేస్తూ రుణాల పంపిణీని కొనసాగించాలని సూచించాం. రైతులకు సకాలంలో రుణాలను మంజూరు చేసి వెన్నుదన్నుగా ఉండాలని నిర్దేశించాం’’ అని రఘునందన్‌రావు తెలిపారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం.. పంట రుణాలు మాఫీ చేయకపోవడంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. గత నాలుగున్నరేండ్లుగా రైతుల లోన్లు మాఫీ చేయకపోవడంతో లక్షల మంది రైతులు ఎగవేతదారులు(డిఫాల్టర్లు)గా మారారు. బ్యాంకర్లు లోన్​లు చెల్లించాలని వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న దృష్ట్యా కేసీఆర్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. సెప్టెంబర్ నెలాఖరుకే రైతుల లోన్లు మాఫీ చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తున్నది. ఇందుకు అవసరమైన నిధులు సమీకరించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చినట్టుగా ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.

రైతుబంధు, బీమా, ఉచిత కరెంట్​ఇస్తున్నా రుణమాఫీ చేయకపోవడంతో రైతులు సర్కారుపై అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. దీనిపై నిర్ణయంప తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రుణమాఫీకి అవసరమైన రూ.20 వేల కోట్ల వరకు సొమ్ము సమకూర్చాలని ఇప్పటికే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్తున్నారు.

Updated : 18 July 2023 3:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top