Home > తెలంగాణ > తుఫాను ప్రభావంపై కలెక్టర్లతో రాహుల్ బొజ్జా సమీక్ష

తుఫాను ప్రభావంపై కలెక్టర్లతో రాహుల్ బొజ్జా సమీక్ష

తుఫాను ప్రభావంపై కలెక్టర్లతో రాహుల్ బొజ్జా సమీక్ష
X

మిజాంగ్ తుఫాను ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. కుండపోత వర్షాలు కురిసే అవకాశముండటంతో విపత్తు నిర్వాహణ శాఖ అప్రమత్తమైంది. ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రాద్రి, ఖమ్మం, ములుగు, హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

మంగళ, బుధవారాల్లో భారీ వర్ష సూచన దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాహుల్ బొజ్జా ఆదేశించారు. భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే నిండిన చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేప్టటాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలని నీట మునిగే అవకాశమున్న ప్రాంతాల నుంచి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాహూల్ బొజ్జా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.




Updated : 5 Dec 2023 7:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top