Rahul Gandhi : అస్సాం సీఎం దేశంలోనే అత్యంత అవినీతిపరుడు: రాహుల్ గాంధీ
X
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతిపరులైన సీఎంలలో ఒకరని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తన భారత్ జోడ్ న్యాయ్ యాత్రను కావాలనే బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుందని అన్నారు. తనను ఎంత ఇబ్బంది పెడితే తనకు అంత మంచి జరుగుతుందన్నారు. బీజేపీ తీరును యావత్ దేశం గమనిస్తుందని, దీనికి తగిన మూల్యం చెల్లించే రోజు వస్తుందని విమర్శించారు. ఈ నెల 11న ఆలయంలోకి, కాలేజీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. తర్వాత 20వ తేదీన అనుమతులు వెనక్కి తీసుకోవడంలో ఉన్న మత్లబ్ ఏంటని ప్రశ్నించారు.
అస్సాం ప్రజలు నిరుద్యోగం, అవినీతి, నిత్యవసర ధరల పెరుగుదల, తమ ఇబ్బందులను తనతో చెప్పుకుంటుని బాధ పడుతున్నారని రాహుల్ చెప్పారు. ఇన్నేళ్లలో అస్సాంలో ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదనని రాహుల్ ఆరోపించారు. కాగా మంగళవారం (జనవరి 23) గౌహతి సమీపంలోని ఖానాపరాలో భారత్ న్యాయ్ జోడో యాత్రను పోలీసులు అడ్డుకోవడంపై మాట్లాడిన రాహుల్.. బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్ శ్రేణలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.