Home > తెలంగాణ > Rahul gandhi:ఇంటి నిర్మాణానికి 5లక్షలు.. విద్యార్థలకు 5 లక్షలు: రాహుల్ హామీ

Rahul gandhi:ఇంటి నిర్మాణానికి 5లక్షలు.. విద్యార్థలకు 5 లక్షలు: రాహుల్ హామీ

Rahul gandhi:ఇంటి నిర్మాణానికి 5లక్షలు.. విద్యార్థలకు 5 లక్షలు: రాహుల్ హామీ
X

కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక్క బీజేపీతో మాత్రమే పోరాడట్లేదని.. బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలతో కూడా పోరాడుతుందని చెప్పుకొచ్చారు. ఇవన్నీ వేరు వేరు పార్టీలుగా కనిపించినా.. చివరికి ఒకటేనని స్పష్టం చేశారు. తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభలో మాట్లాడిన రాహుల్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మండిపడ్డారు. పార్లమెంట్ లో బీజేపీకి అవసరం ఉన్నప్పుడల్లా బీఆర్ఎస్ నేతలు మద్దతు పలుతారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలంతా మోదీ జపం చేస్తున్నారని విమర్శించారు. బయటికి వేరువేరుగా కనిపిస్తున్నా ఆ పార్టీలంతా ఒకటేనని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికారని, జీఎస్టీకి మద్దతునిచ్చారని తెలిపారు.

రాహుల్ ప్రకటించిన హామీలు:

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తరుపున పలు హామీలు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా, సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందిస్తామని తెలిపారు. ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. అన్ని విభాగాల పెన్షన్లను రూ. 4వేలకు పెంచుతామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కల్పిస్తామని అన్నారు. గృహ అవసరాలకు ప్రతీ ఇంటికి 200 యూనిట్ల కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేవలం బీఆర్ఎస్ నాయకులు, కల్వకుంట్ల కుటుంబమే లాభ పడిందని అన్నారు. అనవస అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చారని అన్నారు. రైతు బంధు ద్వారా వాళ్లకు లాభ పడింది పెద్ద రైతులేనని మండిపడ్డారు. పబ్లిక్ కమీషన్ నుంచి పేపర్ లీక్స్ చేస్తూ విద్యార్థులు, నిరుద్యోగుల గొంతు కోస్తున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ పెట్టి రైతులతో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు కర్నాటకకు వెళ్లి.. అక్కడి ప్రజలకు అడగాలని చెప్పారు. అక్కడ కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. కేబీనెట్ లో ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు.















Updated : 17 Sept 2023 7:57 PM IST
Tags:    
Next Story
Share it
Top