Home > తెలంగాణ > Congress Bus Yatra: టిఫిన్‌ బండి వద్ద కాంగ్రెస్ అగ్రనేత.. దోసెలు వేసిన రాహుల్

Congress Bus Yatra: టిఫిన్‌ బండి వద్ద కాంగ్రెస్ అగ్రనేత.. దోసెలు వేసిన రాహుల్

Congress Bus Yatra: టిఫిన్‌ బండి వద్ద కాంగ్రెస్ అగ్రనేత.. దోసెలు వేసిన రాహుల్
X

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయకులు.. ఎన్నికల వేళ పలు ప్రయత్నాలు చేయాల్సిందే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా అదే చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.... ఓ చోట గరిట పట్టారు. టిఫిన్ సెంటర్ లో దోసెలు వేస్తూ... సందడి చేశారు. విజయభేరీ బస్సు యాత్రలో భాగంగా చివరి రోజు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న రాహుల్.. శుక్రవారం ఉదయం జగిత్యాలకు బయలుదేరారు. మార్గమధ్యలో నూకపల్లి బస్టాండు వద్ద వాహనం ఆపిన ఆయన.... రోడ్డు పక్కనున్న ప్రయాణికులను కలిశారు. అక్కడున్న చిన్నారులకు చాక్లెట్లు పంచుతూ, ప్రయాణికులందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. బస్టాండు వద్దనున్న టిఫిన్ బండి వద్దకు వెళ్లిన రాహుల్ గాంధీ.. స్వయంగా దోసెలు వేశారు. టిఫిన్ బండి నిర్వాహకుడి ఆదాయం, ఖర్చుల గురించి తెలుసుకున్నారు.

ఆ తర్వాత జగిత్యాల బస్సు యాత్రలో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని.. లోక్‌సభలోని అన్ని బిల్లులకూ బీఆర్ఎస్ మద్దతిచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశాన్ని నడిపించే అధికారుల్లో 90 శాతం అగ్రవర్ణాల వారేనని.. ఓబీసీలకు అండగా నిలిచేందుకు మోదీ, కేసీఆర్‌ సిద్ధంగా లేరన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం ముందుకు రావడం లేదంటూ విమర్శించారు. ఓబీసీల జనసంఖ్య ఎంతో లెక్కలు ఎందుకు తీయరు? అని రాహుల్ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్నారు.




Updated : 20 Oct 2023 1:41 PM IST
Tags:    
Next Story
Share it
Top