Home > తెలంగాణ > రేపు మేడిగడ్డ బ్యారేజీకి రాహుల్.. కుంగిన పిల్లర్ల పరిశీలన

రేపు మేడిగడ్డ బ్యారేజీకి రాహుల్.. కుంగిన పిల్లర్ల పరిశీలన

రేపు మేడిగడ్డ బ్యారేజీకి రాహుల్.. కుంగిన పిల్లర్ల పరిశీలన
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య ఆయన బ్యారేజీని పరిశీలిస్తారు. ఇటీవలే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. వీటిని రాహుల్ పరిశీలించనున్నారు. కాగా బీఆర్ఎస్ అసమర్ధత వల్లే బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ క్రమంలో రాహుల్ మేడిగడ్డ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది.

మంథని నియోజకవర్గంలోని అంబటిపల్లిలో రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యేందుకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. మేడిగడ్డ సందర్శన తర్వాత రాహుల్ అంబటిపల్లిలో జరిగే మహిళా సదస్సులో పాల్గొంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల కోసం అమలు చేసే పథకాలు సహా ఆరు గ్యారంటీలను వివరించనున్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు.


Updated : 1 Nov 2023 9:52 PM IST
Tags:    
Next Story
Share it
Top