Congress Bus Yatra: ఇవాళ కోల్ బెల్ట్ ఏరియాలో రాహుల్ టూర్..
X
రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతోంది. నిన్న ట్రైబల్ ఏరియాలో పర్యటించిన రాహుల్.. ఇవాళ సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో పర్యటించనున్నారు. 3 పార్లమెంట్ పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ టూర్ సాగుతోంది. ఇవాళ సింగరేణి కార్మికులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కార్మికుల కోసం ఏం చేస్తుందో చెప్తారు. సాయంత్రం 4గంటలకు పెద్దపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. ఇవాళ రాహుల్ సమక్షంలో బీజేపీ రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది.
రాష్ట్రంలో జరగనున్నవి దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన విజయ భేరి యాత్ర బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏర్పాటుచేశామని రాహుల్ స్పష్టం చేశారు. ఏ పార్టీ కూడా తమకు నష్టం జరిగే నిర్ణయం తీసుకోదని... అయినా రాజకీయ లాభనష్టాలు పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని అన్నారు.
రాజస్థాన్లో ఉచిత వైద్యం హామీని నిలబెట్టుకున్నామని ఎలాంటి అనారోగ్యం వచ్చినా రూ. 25 లక్షల వరకు ట్రీట్మెంట్ ఫ్రీగా అందిస్తున్నామని చెప్పారు. ఛత్తీస్ఘడ్లో రైతులకు రుణమాఫీ చేసిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. దేశంలో వరికి అత్యధిక ధర ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. కర్నాటకలో హామీ ఇచ్చిన 5 గ్యారెంటీలను ప్రభుత్వం కొలువుదీరిన తొలిరోజే అమల్లోకి తెచ్చామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.