Home > తెలంగాణ > Rahul Gandhi : తెలంగాణ నుంచి రాహుల్ పోటీ.. కాంగ్రెస్ ప్లాన్ ఏంటంటే..?

Rahul Gandhi : తెలంగాణ నుంచి రాహుల్ పోటీ.. కాంగ్రెస్ ప్లాన్ ఏంటంటే..?

Rahul Gandhi : తెలంగాణ నుంచి రాహుల్ పోటీ.. కాంగ్రెస్ ప్లాన్ ఏంటంటే..?
X

తెలంగాణలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. దీనిని క్యాష్ చేసుకుంటూ లోక్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఆ పార్టీ పావులు కదుపుతోంది. 12 సీట్లకు తగ్గకుండా గెలువాలనే పట్టుదలతో ఉన్న ఆ పార్టీ.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తోంది. ఇప్పటికే మహబూబ్నగర్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించగా.. మెజార్టీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రనేతలతో పాటు పార్టీ పెద్ద తలకాయలను బరిలోకి నిలపాలనే ప్లాన్ లో ఉంది టీ కాంగ్రెస్.

కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ నుంచి పోటీ చేస్తే పార్టీ గ్రాఫ్ మరింత పెరుగుతుందనేది టీ కాంగ్రెస్ భావన. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని సీఎం రేవంత్ ప్రయత్నించారు. స్వయంగా ఆమెను కలిసి.. తమ మనసులోని మాట చెప్పారు. ఖమ్మం స్థానం నుంచి పోటీ చేయాలని సోనియాను కోరారు. అయితే ఆమె ఒకే చెప్పలేదు. కనీసం రాజ్యసభకు అయినా తెలంగాణ నుంచి బరిలో నిలవాలని తెలంగాణ నేతలు కోరినా.. సోనియా మాత్రం రాజస్థాన్ వైపు మొగ్గు చూపింది. దీంతో అక్కడి నుంచి పోటీ చేసి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైంది.

రాహుల్ మీద టీ కాంగ్రెస్ కన్ను

సోనియా ఎపిసోడ్ తర్వాత టీ కాంగ్ నేతల కళ్లు రాహుల్ గాంధీ మీద పడ్డాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ వయానాడ్ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన అమేథీ, వయానాడ్ నుంచి పోటీ చేయగా.. అమేథీలో ఓడిపోయారు. ఈ సారి అమేథీ నుంచి పోటీ చేయాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాహుల్కు సవాల్ విసిరారు. అయితే అక్కడి నుంచి పోటీ చేయడం రాహుల్కు ఇష్టం లేదు. మళ్లీ వయానాడ్ నుంచే పోటీ చేయాలని రాహుల్ భావిస్తున్నారు. అయితే వయానాడ్ సీటును పొత్తులో భాగంగా సీపీఎం అడుగుతోంది. ఇప్పటికే వయానాడ్లో అభ్యర్థిని సైతం ప్రకటించింది.

ఖమ్మం లేదా భువనగిరి

ఈ పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ వయానాడ్ నుంచి కూడా పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ను తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరారు. రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేస్తూ పార్టీ గ్రాఫ్ పెరగడంతో పాటు ఆశించిన ఫలితాలు వస్తాయమని టీ కాంగ్ నేతలు భావిస్తున్నారు. ఖమ్మం, నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లోని ఏదైన స్థానం నుంచి రాహుల్ పోటీ చేయాలని సీఎం రేవంత్ సహా మంత్రులు కోరుతున్నారు. దీనిపై ఖర్గే సహా కేసీ వేణుగోపాల్తో రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది.

కర్నాటక నుంచి కూడా రాహుల్ పోటీ చేయాలనే ప్రతిపాదన ఉంది. కర్నాటకలో బీజేపీ కూడా బలంగానే ఉండడంతో రాహుల్ అక్కడి నుంచి పోటీ చేస్తూ పార్టీకి ప్లస్ అవుతుందని సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భావిస్తున్నారు. దీంతో రాహుల్ పోటీ చేసే స్థానం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ మళ్లీ నార్త్ కు వెళ్లిపోతారా.. లేక సౌత్ నుంచే పోటీ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేస్తే మాత్రం ఆ పార్టీకి అది పెద్ద బూస్ట్గా మారే అవకాశం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు


Updated : 27 Feb 2024 10:44 AM IST
Tags:    
Next Story
Share it
Top