Home > తెలంగాణ > Congress Bus Yatra: నేటి నుంచే కాంగ్రెస్ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే

Congress Bus Yatra: నేటి నుంచే కాంగ్రెస్ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే

Congress Bus Yatra: నేటి నుంచే కాంగ్రెస్ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మ‌రం చేస్తోంది. నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. ఈరోజు నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ములుగు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రఖ్యాత రామప్ప మందిరంలో ప్రత్యేక పూజలు అనంతరం ప్రచారాన్ని షురూ చేయనున్నారు. బస్సు యాత్ర ద్వారా రాహల్, ప్రియాంక లు.. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతునున్నారు. ములుగులో మొదలయ్యే మొదటి విడత బస్సు యాత్ర నిజామాబాద్‌లో ముగుస్తుంది. ఈ యాత్ర సమయంలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజుల్లో 175 కిలోమీటర్లు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం జరగనుంది.

ప్రారంభోత్సవం రోజున భూపాలపల్లిలో జరిగే మహిళా ర్యాలీలో రాహుల్, ప్రియాంక గాంధీ ప్రసంగిస్తారు. ఈ ర్యాలీకి "విజయ్ భేరి పాదయాత్ర" గా నామ‌క‌ర‌ణం చేశారు. మహిళల ర్యాలీ అనంతరం ప్రియాంక గాంధీ ఢిల్లీకి తిరిగి వెళ్ల‌నుండగా, రాహుల్ గాంధీ మరో రెండు రోజుల పాటు తన పర్యటనను కొనసాగించనున్నారు. ఈ నెల 19న మహబూబాబాద్ జిల్లా ములుగు, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో పర్యటించి అనంతరం రామగుండంలో సంగారెడ్డి కాలరీస్ ఉద్యోగులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు. పెద్దపల్లిలో బహిరంగ సభలో పాల్గొని వరి ధాన్యం అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక రైతులతో చర్చించనున్నారు.

బస్సు యాత్ర షెడ్యూల్..

* రాహుల్, ప్రియాంక స్పెషల్ ఫ్లైట్ లో ఈ సాయంత్రం 3.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.

* బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో రామప్ప టెంపుల్ కు వెళ్తారు.

* రామప్ప టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేస్తారు.

* సాయంత్రం 5 గంటలకు బస్సు యాత్రను ప్రారంభిస్తారు.

* బస్సు యాత్ర రామప్ప గుడి నుంచి ములుగు చేరనుంది.

* రామాంజాపూర్‌లో కాంగ్రెస్ బహిరంగ సభలో మహిళలతో రాహుల్, ప్రియాంక ప్రత్యేక సమావేశం కానున్నారు.

* ములుగు సభ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లనున్న ప్రియాంక గాంధీ.

* ములుగు బహిరంగసభ తర్వాత బస్సు యాత్ర భూపాలపల్లి చేరుకుంటుంది.

* భూపాలపల్లిలో నిరుద్యోగ యువతతో కలిసి రాహుల్ ర్యాలీ నిర్వహిస్తారు.

* అనంతరం భూపాలపల్లిలోనే బస చేస్తారు.

* ఆ తర్వాత రామగుండంలో సింగరేణి, ఎన్టీపీసీ కార్మిక సంఘాలతో సమావేశం అవుతారు

* పెద్దపల్లిలో పబ్లిక్ మీటింగ్ తర్వాత రైస్ మిల్లర్స్ సంఘాలతో పాటు రైతులతో ఇష్టాగోష్టి నిర్వహిస్తారు.

*మరుసటి రోజు కరీంనగర్ నుంచి బోధన్ చేరుకుంటారు

* మంథనిలో పాదయాత్రలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు.

Updated : 18 Oct 2023 8:35 AM IST
Tags:    
Next Story
Share it
Top