Rahul Gandhi : ప్లేట్లు కడిగి, గిన్నెలు తోమి.. రాహుల్ గాంధీ స్వచ్ఛంద సేవ
X
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆధ్యాత్మిక సందర్శనలో మునిగిపోయారు. అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఇందులో భాగంగా రాహుల్ తన తలకు బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవలో పాల్గొన్న రాహుల్.. భక్తులతో కలిసి ఆలయ ప్రాంగణంలో పాత్రలు శుభ్రం చేశారు. తర్వాత భజనలో పాల్గొని గుర్బానీ కీర్తనలు విన్నారు. దీని కోసం రాహుల్ ప్రత్యేక విమానంలో అమృత్ సర్ చేరుకున్నారు. జనవరిలో చేసిన భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ దర్బార్ సాహిబ్ ను సందర్శించారు. రాహుల్ పర్యటన గురించి పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా వారింగ్ ఓ ట్వీట్ చేశారు. ‘రాహుల్ ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు అమృత్ సర్ వస్తున్నారు. ఇది ఆయన వ్యక్తిగత ఆధ్యాత్మిక యాత్ర. గోప్యంగా ఉండాలనుకుంటున్నారు. దయచేసి కార్యకర్తలెవరూ ఆయనను కలవడానికి రావద్దు. ఇబ్బంది పెట్టొద్దు. మరోసారి వచ్చినప్పుడు కలిపించే బాధ్యత నాది’ అంటూ చెప్పుకొచ్చారు.