Home > తెలంగాణ > ధరణిపై పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్న రాహుల్ గాంధీ

ధరణిపై పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్న రాహుల్ గాంధీ

ధరణిపై పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్న రాహుల్ గాంధీ
X

ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్ లో రాహుల్ గాంధీతో టీకాంగ్సెస్ నేతల స్ట్రాటజీ కమిటీ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ఈ మీటింగ్ తో తామంతా ఒకే తాటిపై నిలబడ్డామని, తమలో ఎలాంటి విభేదాలు లేవని టీకాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ కాంగ్సెస్ కార్యకర్తల్లో జోరు పెరిగింది. సుమారు రెండున్నర గంటల పాటు ఈ భేటీ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలను రాహుల్ విన్నారని కాంగ్సెల్ నేతలు తెలిపారు. రాష్ట్ర నేతలు ఎన్నికల్లో గెలుపొందేందుకు యూనిటీగా పని చేయాలని రాహుల్ సూచించారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్.. ధరణి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దోచుకుంటుందని మండిపడ్డారు.

కాంగ్సెస్ నేతల సహకారంతో.. ధరణిపై కమిటీ వేయాలని రాహుల్ నిర్ణయించారు. ఈ కమిటీ ద్వారా కేసీఆర్ వైఫల్యాలను, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యం అని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో.. సాధ్యమయ్యే హామీల గురించే మాట్లాడాలని నేతలకు పిలుపునిచ్చారు. కాంగ్సెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో ఏం చేయగలదో ప్రజలకు వివరించాలని నేతలను కోరారు. గతంలో కూడా భారత్ జోడో యాత్రలో ధరణిపై మాట్లాడిన రాహుల్.. ఇప్పుడు దానిపై పూర్తి స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

Updated : 27 Jun 2023 5:23 PM IST
Tags:    
Next Story
Share it
Top