Home > తెలంగాణ > Telangana: తెలంగాణలో మూడు రోజులు వానలు..

Telangana: తెలంగాణలో మూడు రోజులు వానలు..

Telangana: తెలంగాణలో మూడు రోజులు వానలు..
X

తెలంగాణలో మరికొన్ని రోజు వర్షాలు కురవనున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మూడు రోజులపాటు వానలు పడతాయని ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించొచ్చని, ఫలితంగా తెలంగాణలో వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు పది రోజులు ఆలస్యం మొదలు వాటి ఉపసంహరణ కూడా పది రోజులు ఆలస్యం కానుందని అధికారులు చెలిపారు. ఈ సీజన్‌లో మెదక్, నిజామాబాద్, వరంగల్, సంగారెడ్డి సహా 18 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో సగటు వర్షపాతం 616.5 మి.మి కాగా ఈసారి 775.6 మి.మి. గా రికార్డయింది.

రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలలో వర్షపాతం సాధారణ స్థాయికంటే ఎక్కువే నమోదైంది. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 158.8 మిల్లీమీటర్లు కాగా, 220 మిల్లీమీటర్లుగా రికార్డయింది. జూన్‌ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల కాలంలోనూ సాధారణం కంటే 15 శాతం అధికంగా వర్షాలు కురిశాయి.

Updated : 1 Oct 2023 8:44 AM IST
Tags:    
Next Story
Share it
Top