Home > తెలంగాణ > ప్రతీ ఇంటికో కన్నీటి కథ...మోరంచపల్లి

ప్రతీ ఇంటికో కన్నీటి కథ...మోరంచపల్లి

ప్రతీ ఇంటికో కన్నీటి కథ...మోరంచపల్లి
X

భారీ వర్షాలకు అతలాకుతలం అయిన మోరంచపల్లి నెమ్మదిగా తేరుకుంటోంది. 12గంటల పాటూ ప్రణాలు అరచేతిలో పెట్టుకుని బతికిన అక్కడ ప్రజలు...మళ్ళీ తమ తమ ఇళ్ళకు వెళ్ళి పరిస్థితి చూసుకుని భోరున విలపిస్తున్నారు. తమవారిని కోల్పోయిన వారి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది.

భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని మోరంచపల్లి రెండురోజులుగా జలదిగ్భంధంలో చిక్కుకుంది. అక్కడి మోరంచవాగులోకి 5 గ్రామాల నీరు చేరడంతో...అది పొంగిపొర్లి గ్రామాన్ని ముంచేసింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే అన్ని ఇళ్ళల్లోకి నీళ్ళఉ వచ్చేసాయి. జనం దాన్ని రియలైజ్ అయ్యేలోపు 6 అడుగుల నీరు చుట్టుముట్టేసింది. ఇదంతా తెల్లవారుఝామున జరగడంతో ప్రజలు వెంటనే ఏమీ చర్యలు తీసుకోలేకపోయారు. మొత్తం 250 కుటుంబాలు నీళ్ళల్లో చిక్కుకుపోయాయి. రేకుల ఇళ్ళల్లో ఉన్నవారు గోడలను పట్టుకుని, స్లాబ్స్ ఉన్నవారు బిల్డింగ్ లు పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇప్పటివరకు నలుగురు గల్లంతయినట్లు తెలుస్తోంది.

ఎన్డీఆర్ఎఫ్, కేంద్ర ప్రత్యేక బలగాలు గ్రామంలో ఉన్నవారిని కాపాడాయి. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామంలోకి వెళ్ళే దారి మొత్తం మూసుకుపోవడంతో రెండు హెలికాఫ్టర్లలో 50 మంది సిబ్బంది 600మంది గ్రామస్తులను గ్రామం నుంచి బయటకు తీసుకువచ్చారు.

వాగు ఉధృతి తగ్గాక అక్కడ పరిస్థితి భయకంరంగా ఉంది. అక్కడి వాతావరణాన్ని చూసి అధికారులు షాక్ కి గురయ్యారు. గ్రామవాసులు అయితే కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రాణాలు దక్కితే చాలు అనుకున్న గ్రామస్తులు ఇప్పుడు ఎందుకు బతికున్నామా అంటూ ఏడుస్తున్నారు. వస్తువులు పాయిపోయి. పశువుల, పంటలు పోగొట్టుకుని ఏకధాటిగా ఊడుస్తున్నారు. ఇక మీదట ఎలా బతకాలి అని ప్రశ్నిస్తున్న గ్రామస్తుల బాధ వర్ణనాతీతంగా ఉంది.

మోరంచపల్లి వరదకు దాదాపు 40కోట్ల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రతీ ఇంటిలో కనీసం రెండు నుంచి ఆరు ఆవులు చనిపోయాయి. డబ్బులు, వస్తువుల, బియ్యం, వంట సామాగ్రి....ఇలా అన్నీ కోల్పోయారు. 10 కార్లు కొట్టుకునిపోయాయి. 10 లారీలు, 10 టాటా ఏసీలు, 15 ట్రాక్టర్లు, 70 బైక్ లు నీటిలో మునిగిపోయాయి...కొన్ని కొట్టుకుపోయాయి. మోరంచపల్లి కలెక్టర్, భూపాలపల్లి ఎమ్మెల్యే ఆదుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ గ్రామం మామూలు స్థితికి రావాలంటే మరో వారం, పదిరోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు.


Updated : 28 July 2023 12:42 PM GMT
Tags:    
Next Story
Share it
Top