Home > తెలంగాణ > సింగరేణిలో నాన్ స్టాప్ వానలు..బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం

సింగరేణిలో నాన్ స్టాప్ వానలు..బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం

సింగరేణిలో నాన్ స్టాప్ వానలు..బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం
X

తెలంగాణ రాష్ట్ర వ్యప్తంగా బుధవారం పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ బుధవారం నుంచి ఆగకుండా ఏకధాటిగా వానలు పడుతున్నాయి. వర్షాల కారణంగా జిల్లాల్లోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. వర్షాల కారణంగా యంత్రాలు మొరాయిస్తున్నాయి. పని చేయడం కష్టతరంగా మారింది. గనుల్లోని రోడ్లపైన కూడా వర్షాలతో బురద పేరుకుపోయింది. వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. దాదాపు 37 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కొత్తగూడెం జిల్లా పరిధిలోని 3 ఉపరితల గనుల్లో 15వేల టన్నులు, మణుగూరు లోని రెండు ఉపరితల గనుల్లో 15వేల టన్నులతో పాటు ఇల్లందులోని రెండు ఉపరితల గనుల్లో 7 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలే బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడానికి కారణం. భారీ వర్షాల నేపథ్యంలో రెండు షిప్టుల్లోనూ బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గురువారం రాత్రి వానలు తగ్గుముఖం పడితే , శుక్రవారం ఉదయం నుంచి సింగరేణిలో పనులు యథావిధిగా ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు.



Updated : 13 July 2023 7:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top