Home > తెలంగాణ > హైదరాబాద్లో వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం

హైదరాబాద్లో వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం

హైదరాబాద్లో వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం
X

హైదరాబాద్లో జోరు వాన పడుతోంది. ఉదయం నుంచి ముసురు పట్టిన నగరం సాయంత్రానికి భారీ వర్షంతో తడిసిముద్దైంది. వర్షం కారణంగా రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, లంగర్ హౌస్, టోలిచౌకీ, మెహదీపట్నం, అమీర్‌పేట్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, రామంతాపూర్, తార్నాక, సికింద్రాబాద్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, పటాన్ చెరుతోపాటు తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే టైం కావడంతో జనం అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.




Updated : 23 Nov 2023 8:55 PM IST
Tags:    
Next Story
Share it
Top