హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం..
X
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం 9 గంటల వరకు బాగా ఎండ ఉండగా ఆ తర్వాత నగరాన్ని మబ్బు కమ్మేసింది. పలు ప్రాంతాల్లో చల్లని గాలులతో పాటు వర్షం మొదలైంది. సిటీలోని చాలా చోట్ల భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట, ప్రగతినగర్, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్ నగర్, లోయర్ ట్యాంక్ బండ్ లో వర్షం కురుస్తోంది.
సికింద్రాబాద్, హబ్సీగూడ, రామంతాపూర్, ఉప్పల్, సరూర్ నగర్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, ఎల్ బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, జీడిమెట్ల, కొంపల్లి, సూరారం, షాపూర్ నగర్, కుత్బుల్లాపూర్, చింతల్, జగద్గిరిగుట్ట, దుండిగల్, బహదూర్ పల్లి తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. భారీ వర్షం కారణంగా కొన్ని చోట్ల రోడ్లపై నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ జాం అయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్‌లో శనివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ యాదాద్రి, జోగులాంబ, నాగర్ కర్నూల్, మెదక్, సిద్దిపేట, వనపర్తి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు, భారీ వర్షం కురిస్తుందని అధికారులు చెప్పారు.