తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు.. ఈ సారి..
X
తెలంగాణను వర్షాలు వీడడం లేదు. గత పది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో గ్రామాలే మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గత రెండు రోజుల నుంచి వానలు కొంచెం బ్రేక్ ఇచ్చాయి. అయితే రాష్ట్రంలో మరో రెండు రోజులు వానలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో మంగళవారం నుంచి ఐదురోజులపాటు భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉందని ప్రకటించింది.
ఏపీలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణశాఖ తెలిపింది. కోల్‌కతాకు తూర్పున 120 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారం నాటిని తీవ్ర వాయుగుండం బలహీన పడుతుందని అధికారులు తెలిపారు. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. అదే సమయంలో గంటకు 30-40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.