Home > తెలంగాణ > బలపడిన అల్పపీడనం.. మరో మూడురోజులు వర్షాలు

బలపడిన అల్పపీడనం.. మరో మూడురోజులు వర్షాలు

బలపడిన అల్పపీడనం.. మరో మూడురోజులు వర్షాలు
X

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల మేర మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతేకాకుండా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు.

సెప్టెంబర్ లో సాధారణంగా 158.8 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండగా.. ఈసారి 220 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నైరుతి రుతుపవనాలు అక్టోబర్ మూడో వారం తర్వాత వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. నైరుతి రుతుపవనాల వల్ల మెదక్, నిజామాబాద్, వరంగల్, సంగారెడ్డి సహా 18 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌ పరిధిలో సాధారణ వర్షపాతం 616.5 మిల్లీమీటర్లు నమోదు కాగా.. 775.6 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.


Updated : 1 Oct 2023 5:09 PM GMT
Tags:    
Next Story
Share it
Top