Home > తెలంగాణ > రేపటి నుంచి తెలంగాణలో జోరు వానలు.. ఆ జిల్లాలో భారీ వర్షాలు..

రేపటి నుంచి తెలంగాణలో జోరు వానలు.. ఆ జిల్లాలో భారీ వర్షాలు..

రేపటి నుంచి తెలంగాణలో జోరు వానలు.. ఆ జిల్లాలో భారీ వర్షాలు..
X

తెలంగాణలో మళ్లీ వానలు దంచికొట్టనున్నాయి. జులైలో గట్టిగా కొట్టిన వానలు.. అగస్ట్లో అడ్రస్ లేకుండా పోయాయి. గత నెలలో పడిన వర్షాలకు ప్రాజెక్టులు సహా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల గ్రామాలే నీటమునిగి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెలలో వర్షాలు సరిగ్గా లేకపోవడంతో అటు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 నుంచి 7.6 మి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇది శుక్రవారం వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పారు. దీన్ని ప్రభావంతో 18, 19 తేదీల్లో ఓ మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వివరించారు.





20న పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతోంది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.


Updated : 17 Aug 2023 7:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top