weather : తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు.. ఏపీలో..
X
తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీలోనూ మంగళవారం నుంచి వర్షాలు పడతాయని చెప్పింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈనెల 19న బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని తెలిపారు.
whedar పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కన్నా 3.1 డిగ్రీలు అధికం. ఖమ్మంలో 2.2 డిగ్రీలు అధికంగా 34.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేడి వాతావరణం సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుందని చెప్పారు.