Raitu Bandhu : వెలుగులోకి మరో కుంభకోణం..రైతు బంధు స్కీమ్‌లో 2 కోట్ల స్కామ్
X
రైతు బంధు, రైతు బీమా డబ్బులు కొట్టిసిన ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. కొంద మంది కేటుగాళ్లు నకిలీ పత్రాలతో ఖజనకు గండి కొడుతున్నాట్లు గుర్తించమని అన్నారు. కొన్నేళ్లుగా నకిలీ వ్యక్తులు పేరుతో డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. భూములు లేక్కున్నా ఉన్నట్లు చూపించి రైతు బంధు, రైతు బీమా సొమ్ము స్వాహా చేస్తున్నారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో.. పథకాలు, ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ వస్తుండగా.. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో శాఖలోని అవినీతి బయటపడుతూ వస్తుండటం గమనార్హం.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ నిధుల గోల్ మాల్ జరిగిందని ఆరోపించగా.. కాగ్ రిపోర్ట్ కీలక విషయాలు వెల్లడించింది. ఇక.. గొర్రెల పంపిణీ పథకంలోనూ.. అక్రమాలు జరిగినట్టుగా కాగ్ నివేదిక కీలక విషయాలు బయటపెట్టింది. ఉన్నతాధికారుల కళ్లు గప్పి ఆ నిధులు స్వాహా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మొత్తం రూ.2 కోట్లు కొట్టేసిన వ్యవహారంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తేలడంతో అతణ్ని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.గత సర్కార్ మరణించిన రైతులకు బీమా కింద రూ.5 లక్షలు, రైతుబంధు కింద పెట్టుబడి కోసం ఎకరాకు ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని రంగారెడ్డి జిల్లా కొందర్గు మండల వ్యవసాయ శాఖలోని కొందరు అవకాశంగా మార్చుకుని తమ పరిధిలోని రైతుల వివరాలు సేకరించి.. 20 మంది మరణించినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. వాటి ఆధారంగా బీమాకు దరఖాస్తు చేసి, సుమారు రూ.కోటి స్వాహా చేశారు. ముంబయిలోని ప్రధాన కార్యాలయం ఇచ్చిన సమాచారంతో అధికారులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అవినీతి వెలుగులోకి వచ్చింది.