Home > తెలంగాణ > Telangana Assembly electiosns 2023: ట్రాన్స్జెండర్లను అవమానించిన రాజనాల

Telangana Assembly electiosns 2023: ట్రాన్స్జెండర్లను అవమానించిన రాజనాల

Telangana Assembly electiosns 2023: ట్రాన్స్జెండర్లను అవమానించిన రాజనాల
X

బీఆర్ఎస్ సీనియర్ నేత రాజనాల శ్రీహరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నేను మొగోన్ని.. ట్రాన్స్ జెండర్లపై పోటీ చెయ్య. అందుకే నామినేషన్ విత్ డ్రా చేసుకున్నా’అంటూ సంచల వ్యాఖ్యలు చేశారు. వరంగల్ తూర్పు టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ నామినేషన్ విత్ డ్రా చేసుకున్న రాజనాల ఈ వ్యాఖ్యలు చేశారు. డబ్బులకు ఆశపడి నామినేషన్​ విత్​డ్రా చేసుకోలేదని, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్‌‌‌‌‌‌‌‌పై పోటీ చేయడం ఇష్టంలేక విరమించుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సిట్టింగ్​ ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్​ఎస్ ​అభ్యర్థి నరేందర్​ భూకబ్జాదారుడని, రౌడీ, దొంగ అంటూ మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వనని, బీఆర్ఎస్​ అభ్యర్థి నరేందర్ ​ఓటమి కోసం పోరాడుతానని రాజనాల అన్నారు. ట్రాన్స్​జెండర్లపై అనుచిత వాఖ్యలు చేసిన రాజనాలని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్​ చేయాలని.. వరంగల్​ తూర్పు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి చిత్రపు పుష్పిత లయ డిమాండ్​ చేశారు. శ్రీహరిని సస్పెండ్​ చేయకుంటే కేసీఆర్, కేటీఆర్​ ఆదేశాల మేరకే ఆయన ఇలా మాట్లాడినట్లు భావించాల్సి వస్తుందని ఆమె అన్నారు. రాజనాల క్షమాపణలు చెప్పకపోతే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్​జెండర్లంతా ఏకతాటిపైకి వచ్చి రాజనాల ఇంటిని ముట్టడిస్తామని, బీఆర్ఎస్​ను ఓడిస్తామని హెచ్చరించారు.

Updated : 16 Nov 2023 11:29 AM IST
Tags:    
Next Story
Share it
Top