Home > తెలంగాణ > సుజాత టీచర్‌తో రాజేశ్ వ్యవహారం.. రాంగ్ డయల్‌తో రాంగ్ కనెక్షన్

సుజాత టీచర్‌తో రాజేశ్ వ్యవహారం.. రాంగ్ డయల్‌తో రాంగ్ కనెక్షన్

సుజాత టీచర్‌తో రాజేశ్ వ్యవహారం.. రాంగ్ డయల్‌తో రాంగ్ కనెక్షన్
X

ఒక్క మిస్డ్‌ కాల్.. ఇద్దరి అపరిచితుల మధ్య పరిచయానికి దారితీసి.. చివరికి వారి ఆత్మహత్యలకు అసలు కారణమైంది. హైదరాబాద్ లోని హయత్‌నగర్‌ రాజేష్‌ మృతి‌ కేసులో ఎన్నో ట్విస్టులు. మర్డర్‌ యాంగిల్‌ నుంచి.. చివరకు సూసైడ్‌గా సెటిల్‌ అయింది ఈ కేసు. టీచర్‌ ని ప్రేమించి.. విఫలమై.. ఆమెతో పాటు.. అతడు కూడా చనిపోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. పెద్ద అంబర్‌పేట్‌ డాక్టర్స్‌ కాలనీ సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో ఓ యువకుడు మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విస్మయం కలిగించే కీలక ఆధారాలు సేకరించారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాతతో వివాహేతర సంబంధం కారణంగా ఆమె భర్త నాగేశ్వరరావు.. రాజేశ్‌ను హత్య చేసినట్లు పోలీసులు తొలుత భావించినప్పటికీ ఆ తరువాత విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... హయత్‌నగర్‌కు చెందిన గవర్నమెంట్ టీచర్ సుజాత ఫోన్ నుంచి 7 నెలల క్రితం రాజేష్‌కు రాంగ్ డయల్‌గా కాల్ వెళ్లింది. రాంగ్ డయల్‌తో ఇద్దరికి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య తరుచూ వాట్సాప్‌ మెసేజ్‌లు నడిచాయి. సుజాత డీపీ చూసిన రాజేష్.. ఆమెకు పెళ్లి కాలేదనే నమ్మి ప్రేమలో పడ్డాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత సుజాతకు పెళ్లైనట్లు.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుసుకొని... మోసం చేశావని ఆమెతో గొడవపడ్డాడు. అప్పట్నుంచీ సుజాతను దూరంగా పెట్టాడు.

రాజేశ్‌ దూరం కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటానని సుజాత చెప్పింది. దీంతో కంగారుపడి సుజాతను కలుద్దామని హయత్‌నగర్‌కు వెళ్లాడు. అప్పటికే సుజాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వీరిద్దరి వ్యవహారం తెలుసుకున్న సుజాత కూతురు, కొడుకు .. అతడిపై ఆరోజు దాడికి పాల్పడ్డట్లు సమాచారం. సుజాతను హాస్పిటల్ కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందిందిద. దీంతో భయపడిన రాజేష్ పురుగుల మందు తాగాడు. అనంతరం బహిర్భూమి కోసం రాజేశ్‌ ప్యాంటు తీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో రాజేశ్‌ దుస్తులు లేకుండా పడి ఉన్న విషయం తెలిసిందే. సుజాత ఇంటి సమీపంలోనే శవంగా రాజేష్ కనిపించాడని పోలీసులు తేల్చారు.

Updated : 31 May 2023 8:32 AM IST
Tags:    
Next Story
Share it
Top