Home > తెలంగాణ > BJP Election Campaign: నేడు రాష్ట్రానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి .. పూర్తి షెడ్యూల్ ఇదే

BJP Election Campaign: నేడు రాష్ట్రానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి .. పూర్తి షెడ్యూల్ ఇదే

BJP Election Campaign: నేడు రాష్ట్రానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి .. పూర్తి షెడ్యూల్ ఇదే
X

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ నేడు రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. హుజురాబాద్‌లోని జమ్మికుంటతో పాటు మహేశ్వరంలో నిర్వహించే రెండు బహిరంగ సభలకు రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. సోమవారం మధ్యాహ్నం 12:10 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12:40 గంటలకు హుజురాబాద్‌కు చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా జమ్మికుంటకు చేరుకుని మధ్యాహ్నం 1 గంటల నుంచి 2గంటల వరకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ సభ అనంతరం హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు మహేశ్వరం మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగసభలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు. సభ ముగిశాక 7:35 గంటలకు తిరిగి ఢిల్లీకి పయనం అవుతారు రాజ్‌నాథ్ సింగ్.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది బీజేపీ. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు విస్తృత ప్రచారంలో పాల్గొననున్నారు. వీరి పర్యటనలకు సంబంధించిన వివరాలను బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

Updated : 16 Oct 2023 9:22 AM IST
Tags:    
Next Story
Share it
Top