Telangana Congress: కాంగ్రెస్లోకి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్..!
X
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నేతల పార్టీ జంపింగ్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి బీఆర్ఎస్కు బిగ్ షాక్ ఇస్తున్నట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది.
మనోహార్ రెడ్డి ఈ సారి పరిగి నుంచి బీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగాలని అనుకున్నారు. కానీ గులాబీ బాస్ పరిగి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డికే ఇచ్చారు. దీంతో మనోహార్ రెడ్డి పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, వికారాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రామ్మోహన్ రెడ్డి మనోహర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ వారంతా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది. మనోహార్ రెడ్డికి కాంగ్రెస్ తాండూరు టికెట్ ఆఫర్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ అన్ని కుదిరితే రెండు రోజుల్లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది.