Government Jobs : ఒక్కడే నాలుగు ఉద్యోగాలు సాధించాడు.. యువకుడిపై ప్రశంసలు
X
ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగం సాధించాలంటే అంత ఈజీ కాదు. కానీ ఓ యువకుడు ఏకంగా నాలుగ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన రంజిత్ ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా నాలు గు ఉద్యోగాలు సాధించి అందరిచేత శబాష్ అనిపించుకున్నాడు. గ్రామానికి చెందిన వేణుగోపాల్ .. అరుణ దంపతుల పెద్ద కుమారుడైన రంజిత్.. ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వం ఉద్యోగం కోసం కష్టపడి చదివాడు. ఈ క్రమంలోనే 7 నెలల క్రితం రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగం, అనంతరం ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-4 ఉద్యోగాల సాధించాడు.తాజాగా తెలంగాణ ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ పరీక్ష ఫలితాలు విడుదల ,చేయగా రంజిత్ ఆ ఉద్యోగానికి కూడ ఎంపికయ్యారు. కాగా తాను టౌన్ ప్లానింగ్ అధికారి గా చేరునున్నట్లు రంజిత్ తెలిపారు.