Home > తెలంగాణ > ఎన్నికల వేళ ఓటర్లకు ర్యాపిడ్ గుడ్న్యూస్

ఎన్నికల వేళ ఓటర్లకు ర్యాపిడ్ గుడ్న్యూస్

ఎన్నికల వేళ ఓటర్లకు ర్యాపిడ్ గుడ్న్యూస్
X

ఎన్నికల హడావిడి చివరి దశకు చేరుకుంది. ఇవాళ్టితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈనెల 30 జరిగే పోలింగ్ కోసం ఈసీ అంతా సిద్ధం చేసింది. పోలింగ్ కోసం దాదాపు 3 లక్షల మంది విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులే కాకుండా కేంద్రం నుంచి అదనపు బలగాలు కూడా రాష్ట్రానికి వచ్చాయి. కాగా గతంలో గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ శాతం కాస్త తక్కువగా ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ క్రమంలో గ్రేటర్ లో ఓటర్లను చైతన్య పరిచేందుకు ఈసీ అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో ర్యాపిడ్ సంస్థ కీలక నిర్ణం తీసుకుంది. నగరంలోని 2600 పోలింగ్ స్టేషన్స్ లో పోలింగ్ చేసే ఓటర్లకు ఫ్రీ సర్వీస్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీస్ పొందేందుకు ఓటర్లు తమ మొబైల్ లో ర్యాపిడో యాప్ ఇన్ స్టాల్ చేసుకుని ‘ఓట్ నౌ’కోడ్ ను నమోదు చేయాలి. తర్వాత ఫ్రీ రైడ్ ను పొందాలి. ప్రతీ ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఈ సర్వీస్ ను తీసుకొచ్చినట్లు ర్యాపిడో సంస్థ తెలిపింది. చాలామంది రవాణా సదుపాయం లేని కారణంగా ఓటును వినియోగించుకోలేకపోతున్నారు. ఈ కారణంగా తమ వంతు కృషిగా ర్యాపిడో ఈ సేవలను అందిస్తున్నట్లు తెలిపింది.

Updated : 28 Nov 2023 9:15 AM IST
Tags:    
Next Story
Share it
Top