Home > తెలంగాణ > పేషెంట్‎కు కడుపునొప్పి..స్కానింగ్ రిపోర్టులు చూసి డాక్టర్లు షాక్

పేషెంట్‎కు కడుపునొప్పి..స్కానింగ్ రిపోర్టులు చూసి డాక్టర్లు షాక్

పేషెంట్‎కు కడుపునొప్పి..స్కానింగ్ రిపోర్టులు చూసి డాక్టర్లు షాక్
X

సాధారణంగా ఆడవాళ్లకు గర్భసంచి ఉంటుంది. వారు పిల్లలను కనేందుకు ఈ గర్భసంచి ఉపయోగపడుతుంది. కానీ ఇటీవల వెండితెరపైన విడుదలైన మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాలో హీరో సోహైల్ ప్రెగ్నెంట్ అవుతాడు. అయితే తాజాగా ఇలాంటి అరుదైన ఘటనే హైదరాబాద్‎లో జరిగింది. మంచిర్యాలకు చెందిన 40 ఏళ్ల పురుషిడి కడుపులో స్త్రీ జననాంగాలు అభివృద్ధి చెందడం గుర్తించారు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు. ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో ఆ వ్య్తి గర్భసంచితో పాటు మరికొన్న అవయవాలను సర్జరీ చేసి తొలగించారు. విజయవంతంగా సర్జరీని నిర్వహించారు.





‘మంచిర్యాలకు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తికి పెళ్లై చాలా సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు పుట్టలేదు. ఈమధ్యనే పొత్తి కడుపు సమస్య అధికమవడంతో చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లాడు. అయినా సమస్య ఏమిటనేది తెలిసిరాలేదు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు సికింద్రాబాద్‌ లోని కిమ్స్‌ వైద్యులను సంప్రదించాడు. వైద్యులు అతడికి అల్ట్రాసౌండ్‌ సహా వివిధ పరీక్షలు నిర్వహించారు. అతనిలో పురుషాంగం సాధారణంగానే ఉన్నప్పటికీ, స్త్రీలలు ఉండే అవయవాలను అతని గడుపులో గుర్తించారు. గర్భసంచితో పాటు ఫాలోపియన్‌ ట్యూబ్‌లు, స్త్రీ జననాంగంలోని కొంతభాగాన్ని వైద్యులు గుర్తించారు.దీంతో ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో సర్జరీ చేసి అతని శరీరం లోపల ఉన్న వృషణాలు, ఫాలోపియన్‌ ట్యూబులు, గర్భసంచి, స్త్రీ జననాంగాన్ని తొలగించినట్లు కిమ్స్‌ ఆసుపత్రి కన్సల్టెంట్‌ యురాలజిస్టు, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ వై.ఎం.ప్రశాంత్‌ తెలిపారు.





'నిజానికి మహిళలకు, పురుషులకు వేర్వేరు జననాంగాలు, పునరుత్పత్తి ఆర్గాన్స్ ఉంటాయి. కడుపులో పిండం ఏర్పడేటప్పుడు రెండు రకాల ఆర్గాన్స్ ఉన్నా, ఆ తర్వాత హార్మోన్ల ప్రభావంతో ఏదో ఒకటే అభివృద్ధి చెందుతుంది. ఆ రేర్ కేసుల్లో జెనెటిక్ మ్యుటేషన్ కారణంగా అవసరమైన హార్మోన్లు తగినంత స్థాయిలో రిలీజ్ కాకపోవడంతో స్త్రీ, పురుష రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ రెండూ డెవలప్ అవుతాయి. దీన్నే వైద్య పరిభాషలో పెర్సిస్టెంట్‌ ముల్లేరియన్‌ డక్ట్‌ సిండ్రోమ్‌ అని పిలుస్తారు. ఇలాంటి వారిలో వృషణాలు ఉదర భాగంలో ఉండిపోవడం వల్ల వీర్య కణాలు ఉత్పత్తి కావు. అందుకే పిల్లలు పుట్టరు. వరల్డ్ వైడ్‎గా ఇప్పటి వరకు ఇలాంటి రేర్ కేసులు 300 వరకు నమోదు అయ్యాయి. భారత్‎లో 20 వరకు కేసులను గుర్తించారు’ అని డాక్టర్‌ ప్రశాంత్‌ చెప్పారు.




Updated : 23 Aug 2023 5:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top