Home > తెలంగాణ > MLC KAVITHA: ఎమ్మెల్సీ కవితకు అరుదైన అంతర్జాతీయ గౌరవం.. మహిళా బిల్లు కోసం పోరుతో..

MLC KAVITHA: ఎమ్మెల్సీ కవితకు అరుదైన అంతర్జాతీయ గౌరవం.. మహిళా బిల్లు కోసం పోరుతో..

MLC KAVITHA: ఎమ్మెల్సీ కవితకు అరుదైన అంతర్జాతీయ గౌరవం.. మహిళా బిల్లు కోసం పోరుతో..
X

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో ఓ అంతర్జాతీయ సమావేంలో కీలక ప్రసంగం చేయనున్నారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంపై లండన్‌లో నిర్వహించనున్న సదస్సుకు రావాలని ఆమెకు ఆహ్వానం అందింది. బ్రిడ్జ్ ఇండియా అనే ఎన్జీవో ఆమెకు ఈ ఆహ్వానం పంపింది. చట్టసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు ఆమోదం కోసం కవిత ఎంతగానో పోరాడారని సంస్థ తెలిపింది. ‘‘బిల్లు కోసం ఢిల్లీలోని 6000 మందితో ఆమె ధర్నా నిర్వహించారు. 18 పార్టీల నేతలు హాజరై మద్దతు ప్రకటించారు. బిల్లుపై ఢిల్లీలో భారత్ జాగృతి నిర్వహించిన సమావేశంలో 13 పార్టీలు సహా మహిళా, విద్యార్థి, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇలా పలు పోరాటాలతో ఆమె బిల్లకు మద్దతు కూడగట్టారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశ చేశారు. ఈ కృషికి గుర్తింపుగా ఆమె సదస్సుకు ఆహ్వానించాం’’ అని బ్రిడ్జ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. మహిళా బిల్లును పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన నేపథ్యంలో అక్టోబర్ 6న ఒక సమావేశాన్ని లండన్‌లో నిర్వమిస్తున్నమని వెల్లడించింది.

Updated : 1 Oct 2023 2:17 PM IST
Tags:    
Next Story
Share it
Top