ఈ బుల్లిపాములు కనిపిస్తే చంపకండి ప్లీజ్!
X
పాము కనిపిస్తే కర్ర తీసుకుని చంపడం మనకు అలవాటు. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్నట్లు ఏది విషపూరితమో, ఏది కాదో మనకు తెలియదు. ఆత్మరక్షణ కోసం చంపడం సరైందే. కాకపోతే కొన్ని పాముల విషయంలో కాస్త ఆచితూచి స్పందిస్తే మేలంటున్నారు జీవిశాస్త్రవేత్తలు. పాములన్నీ విషపూరితం కాదని, జీవవైవిధ్యం కోసం అరుదైన పాములను కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో అలాంటి అరుదైన రెండు పాములు కనిపించాచయి. విషపూరితం కాని 'కోలుబ్రిడే' జాతికి చెందిన ‘ఎల్లో కాలర్డ్ ఉల్ఫ్ స్నేక్’ బైపాస్ రోడ్డులోని అక్షర కాలనీ కనిపించింది. ఓ ఇంట్లోకి బుల్లిపాము వెళ్లగా డిగ్రీ కాలేజీ లెక్చర్ సదాశివయ్య వెళ్లి చూశారు. దీని శాస్త్రీయ నామం లైకోడాన్ ఫావికల్లిస్ అని ఆయన చెప్పారు. మెడపై పసుపు రంగ మచ్చ ఉండటంతో ఎల్లో కాలర్డ్ వుల్ఫ్ స్నేక్ అంటారని తెలిపారు. మరోవైపు.. జడ్చర్ల ఆలూరు రోడ్డులోని మహాత్మా జోతి బా పూలే సంక్షేమ విద్యాలయం దగ్గర ‘డ్రయోకలామస్ నిఫా’ అనే అరుదైన పాము కనిపించింది. కట్లపామును పోలిన ఈ పాము కూడా విషపూరితం కాదని సదాశివయ్య చెప్పారు. ఈ రెండు జాతుల పాములు చాలా చిన్నవి అని, అరిచేతిలో ఇమిడిపోతాయని అన్నారు.