Ration card update: రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు అలర్ట్.. సెప్టెంబర్ 30 వరకే లాస్ట్
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి రేషన్ కార్డుల సవరణ జరగలేదు. దీంతో బోగస్ రేషన్ కార్డులు పెరిగిపోయాయి. చాలా వరకు దుర్వినియోగం జరుగుతుంది. దీన్ని అరికట్టేందుకు సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రేషన్ కార్డుల్లో నమోదైన సభ్యులు ఎంత మంది ఉన్నారో.. వాళ్లందరికీ రేషన్ ఇస్తున్నారు. కానీ వాస్తవం చూసుకుంటే.. గడిచిన తొమ్మిదేళ్లలో ఎన్నో ఇళ్లలో కుటుంబ సభ్యులు చనిపోయారు. అమ్మాయిలు వివాహం జరిగింది. కొడుకులు పెళ్లి చేసుకొని కొత్త కుటుంబంగా ఏర్పడ్డారు. ఉద్యోగం, ఉపాధి పేరిట ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డవాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ల పేర్ల మీద ఇప్పటికీ రేషన్ పంపిణీ జరుగుతోంది. దీంతో.. ప్రజాపంపిణీ దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు సిద్ధమైంది. అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు ‘కేవైసీ’తో రేషన్ కార్డ్ వెరిఫికేషన్‌కు శ్రీకారం చుట్టింది.
ఇప్పటి వరకు రేషన్‌కార్డ్ ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరు వెళ్లినా.. వేలిముద్ర వేసి బియ్యం తీసుకునే అవకాశం ఉండేది. అయితే ఈ తాజా నిర్ణయంతో రేషన్ కార్డ్ లో.. కుటుంబంలో ఎవరెవరి పేర్లున్నాయని తెలుస్తుంది. అందుకు కుటుంబంలోని వ్యక్తి ఒకసారి రేషన్ దుకాణానికి వెళ్లి కేవైసీ చేసుకోవల్సి ఉంటుంది. దీంతో కార్డులో ఎంతమంది ఉన్నరన్న విషయం తెలుస్తుంది. ఈ దెబ్బతో సరకుల కోటా, బియ్యం పంపిణీ కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కేవైసీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సెప్టెంబర్ 30 తేదీ వరకు కేవైసీ అప్ డేట్ కు గడువు ఇచ్చారు. కార్డులో ఎంతమంది పేర్లుంటే వాళ్లంతా కేవైసీ చేసుకోవాలి. ఉదాహరణకు ఒక కుటుంబంలో ఆరుగురు సభ్యులుంటే.. అందరూ కేవైసీకి చేసుకోవల్సి ఉంటుంది. ఎవరైనా చేసుకోకపోతే.. వాళ్ల పేర్లు రేషన్ జాబితా నుంచి తొలగిస్తారు. రేషన్ కూడా అందదు. కాబట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కేవైసీ అప్డేట్ చేసుకోవని సూచిస్తున్నారు.