BREAKING NEWS: తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తా
X
తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ అత్యుత్సాహం కొంప ముంచింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందుకు ఆయనపై వేటు పడింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనర్హం. అంజనీ కుమార్ ఈ రోజు ఉదయం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవడంపై విమర్శలు వచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే డీజీపీ అంజనీ కుమార్ రేవంత్ రెడ్డిని కలవడం సరికాదని ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ ఉంల్లంఘించిన ఆయన పదవిలో ఉండడం సరికాదని సస్పెండ్ చేసింది. కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంజనీ కుమార్ ఏర్పాట్లు చేస్తుండగా ఈసీ ఆయనను పదవి నుంచి తప్పించింది. కాగా ఈసీ తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తాను నియమించింది. అంజనీ కుమార్ ను తప్పించిన తర్వాత.. కొత్త డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను సీఎస్ శాంతికుమారి ఈసీకి సిఫార్సు చేశారు. ఇందులో రవిగుప్తాను కొత్త డీజీపీగా ఈసీ నియమించింది.