వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్క రోజే 32 ప్రసవాలు..
X
వనపర్తి మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఒక్క రోజే 32 ప్రసవాలు చేసి పాత రికార్డును బద్దలు కొట్టింది. శనివారం రోజు మొత్తం 32 డెలివరీలు జరిగాయి. ఇందులో 17 నార్మల్ డెలివరీలు కాగా..15 సిజేరియన్లు ఉన్నాయి. అందులో 13 మంది గర్భిణులకు తొలి కాన్పులు జరగగా.. వీరిలో 9 మందికి నార్మల్ డెలివరీలు అయ్యాయి. వనపర్తిలోని ఇదే సర్కార్ ఆస్పత్రిలో మూడు నెలల ముందు 29 డెలివరీలు జరిగాయి. ఆ రికార్డును తాజాగా అధిగమించినట్లు గైనకాలజిస్టు విభాగంహెడ్ ప్రకటించారు.
శనివారం జరిగిన ప్రసవాల్లో 20 మంది మగ. 12 మంది ఆడ శిశువులు జన్మించారు. దీంతో వనపర్తి ఆస్పత్రి చిన్నారుల చిరునవ్వులతో కళకళలాడింది. ఒకే రోజు అత్యధికంగా విజయవంతంగా డెలివరీలు చేసిన డాక్టర్స్ టీమ్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి, ఉన్నతాధికారులు అభినందించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం పెరిగిందని మంత్రులు తెలిపారు.