రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్..ఇకపై టీఎస్ బదులు టీజీ
X
తెలంగాణలో ఇక వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్ టీఎస్ నుంచి టీజీగా మారనుంది. ఈ మేరకు టీజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వెకిల్స్ యాక్ట్ 1988లోని సెక్షన్ 41(6) ప్రకారం.. టీఎస్ స్థానంలో టీజీని ప్రవేశపెడుతూ సెంట్రల్ రోడ్, ట్రాన్స్ఫోర్ట్ డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1989 జూన్ 12న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన గెటిట్‌లో ఈ మేరకు మార్పులు చేసింది.
అయితే సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్కును మార్చేందుకు నిర్ణయించారు. ఈ విషయమై చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. దీంతో, కేంద్రం అందుకు అనుగుణంగా తగు మార్పులు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలో కొత్త వాహనాలను టీజీ మార్కుతో రిజిస్టర్ చేయనున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.