Home > తెలంగాణ > రిజిస్ట్రేషన్లు బంద్.. రూ.50 కోట్ల ఆదాయం కోల్పోయిన సర్కారు

రిజిస్ట్రేషన్లు బంద్.. రూ.50 కోట్ల ఆదాయం కోల్పోయిన సర్కారు

రిజిస్ట్రేషన్లు బంద్.. రూ.50 కోట్ల ఆదాయం కోల్పోయిన సర్కారు
X

తెలంగాణవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. వ్యవసాయ ఆస్తులు మినహా మిగతా వాటి రిజిస్ట్రేషన్ ఆగిపోయినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెప్పారు. డాక్యుమెంట్లు స్కానింగ్‌, ప్రతి డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌కు సబ్‌ రిజిస్ట్రార్లు బయోమెట్రిక్‌ ద్వారా లాగిన్‌ కావాల్సి ఉంది. అయితే ఆ సర్వీసు కూడా పని చేయలేదు. అదే విధంగా రిజిస్ట్రేషన్‌ పూర్తైన తర్వాత డాక్యుమెంట్లు స్కానింగ్ చేసే అవకాశం లేకుండాపోయింది.

రకరకాల సాంకేతిక కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా 140 కిపైగా సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు అధికారులు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్లు పనిచేయకపోవడంతో ప్రభుత్వం రూ.40 నుంచి రూ.50 కోట్ల మేర ఆదాయం కోల్పోయినట్లు సమాచారం.

Updated : 11 Sept 2023 9:11 PM IST
Tags:    
Next Story
Share it
Top