Home > తెలంగాణ > జూ. పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్.. ఇకపై గ్రేడ్‌-4 హోదా

జూ. పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్.. ఇకపై గ్రేడ్‌-4 హోదా

జూ. పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్.. ఇకపై గ్రేడ్‌-4 హోదా
X

రాష్ట్రంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్‌) రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 6,603 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులుగా గుర్తిస్తూ.. ఆర్థిక శాఖ సెప్టెంబరు 16న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జేపీఎస్‌ (JPS)లు ఇకపై పంచాయతీరాజ్‌ కార్యదర్శులుగా గ్రేడ్‌-4 హోదాలో కొనసాగనున్నారు.

వివరాల్లోకెళ్తే.. గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండాలనే లక్ష్యంతో ఒకేసారి 9వేలకు పైగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారు. వీరికి పరీక్ష నిర్వహించి అర్హులైన వారిని జేపీఎస్‌లుగా నియమించారు. గత 4 సంవత్సరాలుగా వీరు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్నారు. నాలుగేండ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారందరినీ క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్‌, డీఎస్పీ, డీఎఫ్‌వోలతో కమిటీని నియమించి రెగ్యులరైజేషన్‌కు అర్హులైన వారి జాబితాను పంచాయతీరాజ్‌కు అందించారు. జేపీఎస్‌లను పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-4లను క్రియేట్‌ చేయాలని కోరుతూ ఆర్థిక శాఖకు పంచాయతీరాజ్‌ శాఖ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ పోస్టులపై ఆర్థిక శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు నెలకు రూ.28,719 వేతనం వస్తుండగా.. గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులకు వేతన స్కేల్‌ను రూ.24,280-72,850 వర్తింపజేయనుంది.

రాష్ట్రంలో 9355 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా.. వారిని క్రమబద్ధీకరించి గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులుగా మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. అర్హులను గుర్తించాలని గతంలో కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జిల్లాల్లో వారి పనితీరును అంచనా చేసి 6616 మందిని క్రమబద్ధీకరణకు అర్హులుగా గుర్తించి వారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ వినతి మేరకు కొత్తగా 6603 గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేసింది. మంజూరు పోస్టుల కంటే 13 మంది అర్హులు ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే శాఖాపరంగా ఉన్న 3065 పోస్టుల్లో వారిని సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Updated : 17 Sept 2023 12:51 PM IST
Tags:    
Next Story
Share it
Top