Home > తెలంగాణ > Breaking: తెలంగాణలో విద్యుత్ సంస్థల డైరెక్టర్ల తొలగింపు

Breaking: తెలంగాణలో విద్యుత్ సంస్థల డైరెక్టర్ల తొలగింపు

Breaking: తెలంగాణలో విద్యుత్ సంస్థల డైరెక్టర్ల తొలగింపు
X

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తన పాలనలో ఒక మార్క్‌ చూపిస్తోంది. గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలంగా ఉన్న అధికారులను బదిలీ, తొలగిస్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు ఐఏఎస్‌, ఐపీఎస్‌లను మార్చిన ప్రభుత్వం తాజాగా తెలంగాణలో విద్యుత్ సంస్థల డైరెక్టర్ల తొలగించింది. అక్రమంగా నియామకం పొందిన 9 మంది డైరెక్టర్లతో సహ 11 మందిపై వేటు వేసింది. TSSDCL, TSNPDCL డైరెక్టర్లను తొలగించిన ప్రభుత్వం.. వెంటనే కొత్త డైరెక్టర్ల నియామకానికి చర్యలు చేపట్టింది.

అక్రమంగా నియామకం పొందిన మొత్తం 11 మందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లను తొలగిస్తూ సోమవారం సీఎం శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. కొత్త డైరెక్టర్ల నియామాలకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిరాగానే ముందుగా విద్యుత్ సంస్థపైనే దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. అసెంబ్లీ వేదికగా విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలపై 30 పేజీలతో శ్వేతపత్రం సైతం విడుదల చేశారు. దీనిపై రెండ్రోజులు అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడి చర్చలు జరిగాయి. తాజాగా.. సంస్థలో ప్రక్షాళన ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విద్యుత్ డిపార్ట్‌మెంట్ కీలక పాత్ర పోషిస్తున్న డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 29 Jan 2024 5:21 PM IST
Tags:    
Next Story
Share it
Top