Home > తెలంగాణ > MLC Kavitha : TSPSC ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని తొలగించండి..

MLC Kavitha : TSPSC ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని తొలగించండి..

MLC Kavitha : TSPSC ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని తొలగించండి..
X

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవి నుంచి మహేందర్ రెడ్డిని తొలిగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఆయన పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో న్యాయ విచారణకు ఆదేశించాలని కవిత తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనులను తాము చేసినట్లు రేవంత్ సర్కారు చెప్పుకుంటోందని కవిత విమర్శించారు. ప్రభుత్వంలో ఉండి మాజీ సీఎం కేసీఆర్‌ను ఇష్టానుసారం దూషించడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రగీతం గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆమె అన్నారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రేవంత్‌ ఎన్నడూ ‘జై తెలంగాణ’ అని కూడా అనలేదన్నారు. ‘‘తెలంగాణ తల్లి విగ్రహం నాలా ఉందని సీఎం అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో 3-4 గంటలపాటు విద్యుత్‌ కోతలు ఉంటున్నాయి. విద్యుత్‌ సంస్థల్లో ఏపీ వాళ్లను డైరెక్టర్‌లుగా నియమించారు.

తెలంగాణ అసెంబ్లీకి ఏపీ అడ్వైజర్‌ ఎందుకు? గతంలో సలహాదారులే వద్దన్న రేవంత్‌ ఇప్పుడెలా నియమిస్తున్నారు? ఇదంతా రాజకీయ పునరావాసం కోసమే కదా?’’ అని కవిత ప్రశ్నించారు. రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయని చెప్పారు. విద్యుత్‌ సంస్థల్లో ఆంధ్రప్రదేశ్‌ వాళ్లను డైరెక్టర్లుగా నియమించారని విమర్శించారు. చంద్రబాబు డైరక్షన్‌లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నట్లుందని ఆరోపించారు. అర్హత లేని వ్యక్తులను సలహాదారులుగా నియమించారని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీకి ఏపీ అడ్వైజర్‌ ఎందుకని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి తరఫున ఓటుకు నోటు కేసును వాదించిన లాయర్లకు ప్రభుత్వం తరఫున జీతాలిస్తున్నారని చెప్పారు. సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలు పోగొట్టిందే కాంగ్రెస్‌ అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 20 వేల డిపెండెంట్‌ ఉద్యోగాలిచ్చామని చెప్పారు. జీఎం స్థాయిలో చేయాల్సిన పనిని సీఎం చేస్తున్నారని విమర్శించారు. కొత్తగా 400 ఉద్యోగాలు ఇచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని వెల్లడించారు. సింగరేణిలో ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రయత్నించిందని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో సింగరేణి ఉద్యోగాల్లో కోత విధించారని గుర్తుచేశారు.

Updated : 8 Feb 2024 11:45 AM IST
Tags:    
Next Story
Share it
Top