Home > తెలంగాణ > Lakshmi Barrage : మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రారంభమైన రిపేరింగ్ పనులు

Lakshmi Barrage : మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రారంభమైన రిపేరింగ్ పనులు

Lakshmi Barrage  : మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రారంభమైన రిపేరింగ్ పనులు
X

మేడిగడ్డ బ్యారేజీ వద్ద మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. బ్యారేజీ పిల్లర్ కుంగడంతో కాంట్రాక్ట్ సంస్థ ఎల్ అండ్ టీ మరమ్మత్తులు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అవడంతో ఎల్ అండ్ టీ ఈ పనులను మొదలుపెట్టింది. మొదటి దశలో రూ.55 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టనుంది. బ్యారేజీ 7వ బ్లాక్ లోని పిల్లర్లు కుంగగా.. రిపేర్లు చేసేందుకు వీలుగా నీళ్లు రాకుండా 7, 8వ బ్లాక్ ల చుట్టూ కాఫర్ డ్యామ్ నిర్మిస్తోంది. గత రెండ్రోజులుగా భారీ నిర్మాణ యంత్రాల సహాయంతో గోదావరి ఒడ్డున ఉన్న మట్టి, రాళ్లు అడ్డుగా పొస్తున్నట్లు తెలుస్తోంది.

కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక పిల్లర్ల దగ్గర ఇసుకను తవ్వి చూస్తేనే బ్యారేజీ ఎంత మేరకు డ్యామేజీ అయిందనేది క్లారిటీ రానుంది. ఇక బ్యారేజీ వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఇరిగేషన్ శాఖ అనుమతి ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. అయితే మరమ్మత్తు పనులకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఎల్ అండ్ టీ ప్రభుత్వాన్ని కోరింది. దీన్నిపై రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. కాంట్రాక్ట్ సంస్థే రిపేర్లు చేయాలని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఎల్ అండ్ టీ రిపేర్ పనులు మొదలుపెట్టడం గమనార్హం.


Updated : 24 Dec 2023 5:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top