Shiva Balakrishna : ఇవాళ్టితో ముగియనున్న రెరా సెక్రటరీ ఏసీబీ కస్టడీ.. సోదరుడి అరెస్ట్..
X
రెరా సెక్రెటరీ శివ బాలకృష్ణ ఆస్తులు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ఆయన కాసుల కక్కుర్తి చూసి అధికారులే షాక్ అవుతున్నారు. ఇవాళ్టితో శివ బాలకృష్ణ ఏసీబీ కస్టడి ముగియనుంది. దీంతో ఆయను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అవినీతి కేసులో మరింత విచారణ చేయాల్సి ఉందని ఆయన పొడిగించాలని అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది. గత వారం రోజుల నుంచి ఏసీబీ ఆయన్ని విచారిస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా ఆస్తులను గుర్తించారు. అదేవిధంగా బ్యాంక్ లాకర్ల నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆయన్ని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనుంది. నవీన్ బాలకృష్ణకు బినామీగా అధికారులు గుర్తించారు. నవీన్ సహా అతడి భార్య భారీగా ఆస్తులు ఉన్నట్లు విచారణలో తేలింది. జనగామ, గజ్వేల్, యాదాద్రి ప్రాంతాల్లో నవీన్, అరుణపై భూముల ఉన్నట్లు అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ డైరెక్టర్గా ఉన్నప్పుడు శివ బాలకృష్ణ చేసిన అవినీతిపై ఏసీబీ ప్రత్యేక నజర్ పెట్టింది.హెచ్ఎండీఏ డైరెక్టర్గా ఆయన మూడేళ్లు పనిచేశారు. ఈ సమయంలో 120కి పైగా అనుమతులు జారీ చేసినట్లు ఏసీబీ గుర్తిచింది. శంషాబాద్ ఘట్ కేసర్, శంకర్ పల్లి జోన్లో 120కి పైగా అనుమతులు జారీ చేసినట్లు తేల్చారు. ఈ క్రమంలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ డాక్యమెంట్లను అధికారులు పరిశీలించారు.